అందరం ఏకమై పోరాడుదాం...

     Written by : smtv Desk | Wed, Feb 28, 2018, 06:17 PM

అందరం ఏకమై పోరాడుదాం...

మచిలీపట్నం, ఫిబ్రవరి 28 : రాష్ట్రమంతా ఏకమై ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడేందుకు కలిసి రావాలని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షలో పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార, ప్రతిపక్షాలు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడకుండా కేంద్రంపై కలిసి పోరాడేందుకు సిద్ధ౦ కావాలన్నారు. రాజ్యసభలో అన్ని పక్షాల ఆమోదం మేరకు అప్పటి ప్రధాని స్వయంగా ప్రకటించిన ప్రత్యేకహోదా అమలు చేయకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.

చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని చూసి భయపడుతుంటే.. మోదీ కాంగ్రెస్‌ పార్టీని చూసి భయపడుతున్నారన్నారు. రాష్ట్ర మాజీమంత్రి శైలజానాథ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమన్నారు.మార్చి మొదటివారంలో దిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరు ఐక్యతగా ప్రత్యేకహోదా కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు.

Untitled Document
Advertisements