బోర్డర్ లో భారీ కూంబింగ్..

     Written by : smtv Desk | Sat, Mar 03, 2018, 01:12 PM

బోర్డర్ లో భారీ కూంబింగ్..

భూపాలపల్లి, మార్చి 3 : తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతంలో మరోమారు పోలీసులు భారీ కూంబింగ్ చేపట్టారు. నిన్న తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతల కోసం నేడు మరోమారు వేట మొదలైంది. అది దట్టమైన అటవీప్రాంతం కావడంతో అక్కడ భారీగా భద్రతబలగాలు మోహరించారు. వెంకటాపూర్ సరిహద్దు కోడిపుంజు కొండల వద్ద గ్రేహౌండ్స్ దళాలు భారీగా చుట్టుముట్టాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

కాగా ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్ లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఆ పోస్టుమార్టం అనంతరం మృతుల వివరాలను వెల్లడిస్తామని ఎస్పీ అంబర్ కిషోర్ తెలిపారు. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్ లో మొత్తం పదిమంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వారిలో ఏడుగురు మహిళలున్నట్లు సమాచారం.

Untitled Document
Advertisements