నేడు కొనసాగనున్న థియేటర్ల బంద్..

     Written by : smtv Desk | Sat, Mar 03, 2018, 03:23 PM

నేడు కొనసాగనున్న థియేటర్ల బంద్..

హైదరాబాద్, మార్చి 3 : తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలలో సినిమా థియేటర్ల బంద్ రెండో రోజు యాథావిధిగా కొనసాగుతోంది. వర్చువల్‌ ప్రింట్‌ ఫీజ్‌, కట్‌ ఆఫ్‌ టైమ్‌ తగ్గించాలనే అంశంపై డిజిటల్‌ ప్రొవైడర్స్‌తో సంప్రదింపులు జరిపినా ఎలాంటి ఫలితం లేకపోవడం వల్ల బంద్‌ పాటిస్తున్నామని పంపిణీదారుల సంఘం పేర్కొంది. నిన్న సాధారణ థియేటర్లతో పాటు వివిధ మల్టీఫ్లెక్స్‌లు మూతపడగా నేడు మల్టీఫ్లెక్స్‌లు పాక్షికంగా బంద్ పాటిస్తున్నాయి.

ఇదిలా ఉండగా డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లను నిర్మాతల మండలి ఐకాస చర్చలకు ఆహ్వానించింది. అదే జరిగి నిర్మాతల డిమాండ్లకు డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు అంగీకారం తెలిపితే థియేటర్లు తెరుచుకోనున్నాయి. లేదంటే బంద్ అలాగే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల వైఖరిని నిరసిస్తూ దక్షిణాది నిర్మాతల మండలి ఐకాస బంద్‌కు పిలుపునివ్వడంతో రెండు రోజులుగా థియేటర్లన్ని మూత‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Untitled Document
Advertisements