లాభసాటి వ్యవసాయ౦లో ముందడుగు : ఎంపీ కవిత

     Written by : smtv Desk | Sat, Mar 03, 2018, 03:26 PM

లాభసాటి వ్యవసాయ౦లో ముందడుగు : ఎంపీ కవిత

జగిత్యాల, మార్చి 3 : జగిత్యాల జిల్లా లక్ష్మీపురం రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విషయంలో ఇతరులకంటే ముందున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. లక్ష్మీపురంలో 2 కోట్లతో నిర్మించనున్న విత్తన శుద్ధి కర్మాగారం, విత్తన గిడ్డంగి నిర్మాణ పనులకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు. లక్ష్మీపురం గ్రామానికి 200 డబుల్ బెడ్రూం ఇళ్ళు మంజూరు చేయించుకుంటామని ఎంపీ కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Untitled Document
Advertisements