రాజ్యసభ రేపటికి వాయిదా..

     Written by : smtv Desk | Mon, Mar 05, 2018, 03:49 PM

రాజ్యసభ రేపటికి వాయిదా..

న్యూఢిల్లీ, మార్చి 5 : పార్లమెంట్ సమావేశాల తీరుపై రాజ్యపలువురు ఎంపీలు తమ ఆందోళనలను కొనసాగిస్తూ.. సభకు అంతరాయం కలిగిస్తున్నారు. వాయిదా అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో సభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సభను రెండుమార్లు వాయిదా వేసినా.. పరిస్థితిలో మార్పు మాత్రం రాలేదు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాల్సిందేనంటూ ఏపీ ఎంపీలు చైర్మన్ వెల్‌ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌.. ఎంత వారించినా సభ్యులు వినకపోవడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు‌ కురియన్‌ ప్రకటించారు.

Untitled Document
Advertisements