28 వరకు ఏపీ శాసనసభ సమావేశాలు..!

     Written by : smtv Desk | Mon, Mar 05, 2018, 06:48 PM

28 వరకు ఏపీ శాసనసభ సమావేశాలు..!

అమరావతి, మార్చి 5 : ఏపీ శాసనసభ సమావేశాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నేటి నుండి ఏపీ శాసనసభ సమావేశాలు ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. సమావేశాలకు మధ్యలో ఐదు రోజుల పాటు సెలవులు ఉంటాయని తెలిపారు. అలాగే గవర్నర్ ప్రసంగంపై ఈ నెల 7 వ తేదీన చంద్రబాబు సమాధానమిస్తారన్నారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను వెల్లడించినట్లు తెలిపారు. దీనితో పాటే ఈ నెల 8వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెడతారని వెల్లడించారు.

Untitled Document
Advertisements