'ది విజన్ ఆఫ్ భరత్' రేపే విడుదల..

     Written by : smtv Desk | Mon, Mar 05, 2018, 07:17 PM

'ది విజన్ ఆఫ్ భరత్' రేపే విడుదల..

హైదరాబాద్, మార్చి 5 : ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ చివరి షెడ్యుల్ కు చేరుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా మహేశ్ కనిపించనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సినిమాపై అందరిలో ఆసక్తిని రేకెత్తించే విధంగా పోస్టర్స్ ను విడుదల చేస్తూ వస్తోంది చిత్ర బృందం. అలాగే రేపు సాయంత్రం 6 గంటలకు 'ది విజన్ ఆఫ్ భరత్' ను పరిచయం చేయనున్నట్టు చెబుతూ.. కొత్తగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబుకి జంటగా బాలీవుడ్ బ్యుటి కైరా అద్వాని నటిస్తుంది.

Untitled Document
Advertisements