సూర్య 'ఎన్.జి.కె.' ఫస్ట్ లుక్ విడుదల..

     Written by : smtv Desk | Mon, Mar 05, 2018, 07:24 PM

సూర్య 'ఎన్.జి.కె.' ఫస్ట్ లుక్ విడుదల..

చెన్నై, మార్చి 5 : హీరో సూర్య.. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న 'ఎన్.జి.కె.' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సూర్య తన ప్రతి సినిమాలాగే ఈ సినిమాను కూడా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. నేడు దర్శకుడు సెల్వరాఘవన్ పుట్టినరోజు సందర్భంగా 'ఎన్.జి.కె.' ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సూర్య మాస్ స్టైల్ లో కనిపించారు. సూర్యకి జంటగా రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవిలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.

Untitled Document
Advertisements