"షమ్మి" ఆంటీ కన్నుమూత..

     Written by : smtv Desk | Tue, Mar 06, 2018, 11:48 AM


ముంబై, మార్చి 6 : బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. అలనాటి నటి షమ్మి ఆంటీ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్ సందీప్‌ ఖోస్లా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. నివాళులు అర్పించారు. బాలీవుడ్ దిగ్గజం బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. షమ్మి ఆంటీకి ట్విట్టర్ ద్వారా అశ్రు నివాళిని అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని తన భావాలను వ్యక్తం చేశారు.

18 ఏళ్ల వయసులో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన షమ్మి.. 200 లకు పైగా చిత్రాలలో నటించింది. అలాగే బుల్లితెరపై కొన్ని షోలు కూడా చేసింది. 'గోపీ కిషన్', 'హమ్', 'కూలీ నంబర్ 1', 'హమ్ సాత్ సాత్ హై', ఖుదా గవా, హమ్‌, ఆర్థ్‌, ది బర్నింగ్‌ ట్రెయిన్‌ తదితర హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

Untitled Document
Advertisements