చియాన్ తనయుడు 'అర్జున్ రెడ్డి'

     Written by : smtv Desk | Tue, Mar 06, 2018, 12:46 PM

చియాన్ తనయుడు 'అర్జున్ రెడ్డి'

చెన్నై, మార్చి 6 : టాలీవుడ్ లో ఎన్నో వివాదాల మధ్య విడుదలై సంచలన విజయాన్ని సాధించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా భారీ వసూళ్ళను రాబట్టి మొత్తం సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇతర భాషా సినీ పరిశ్రమలు సైతం ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం పోటీపడుతున్నారు. తమిళంలో ఈ రీమేక్ ను స్టార్ హీరో చియాన్ విక్రమ్.. తన కుమారుడితో చేయించడానికి ఆసక్తి చూపుతున్నాడు.

నిజానికి మరో రెండు సంవత్సరాల తరువాత ధృవ్ ను హీరోగా పరిచయం చేద్దామని విక్రమ్ అనుకున్నాడట. కాని 'అర్జున్ రెడ్డి' కంటెంట్ ఆయనకి బాగా నచ్చడంతో ధృవ్ ను తెరకి పరిచయం చేయడమే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. బాలా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు 'వర్మ' టైటిల్ పెట్టారు. ధృవ్ గడ్డం ఉన్న లుక్ తో అదుర్స్ అనిపిస్తున్నాడు.

Untitled Document
Advertisements