ప్రజల పక్షమే.. నా పక్షం : చంద్రబాబు

     Written by : smtv Desk | Tue, Mar 06, 2018, 04:06 PM

ప్రజల పక్షమే.. నా పక్షం : చంద్రబాబు

అమరావతి, మార్చి 6 : రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ శాసన సభ సమావేశ౦లో భాజాపా నేతల వ్యాఖ్యలపై మాట్లాడారు. "కేంద్రం.. రాష్ట్రాల విభజన సమయంలో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని కోరుతున్నా. బీజేపీ నేతలు అనవసరంగా మాట్లాడకుండా రాష్ట్రానికి చేయాల్సిన విషయాలపై కేంద్రానికి వివరిస్తే మంచిది. రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసింది కాబట్టే అడ్రస్ లేకుండా పోయింది. ప్రజల పక్షమే నా పక్షం. మిత్రపక్షం కాబట్టే ఇంత సంయమనంతో మాట్లాడుతున్నా. అలా కాకపోయుంటే పరిస్థితి వేరేలా ఉండేది" అంటూ ఘాటుగా స్పందించారు.

Untitled Document
Advertisements