'సాహో' బ్యూటీ ఫస్ట్ లుక్..

     Written by : smtv Desk | Tue, Mar 06, 2018, 04:07 PM

'సాహో' బ్యూటీ ఫస్ట్ లుక్..

హైదరాబాద్, మార్చి 6 : యావత్ భారత దేశం గర్వించదగ్గ "బాహుబలి 2" చిత్రం తర్వాత ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' సినిమాలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఇదివరకే చిత్ర యూనిట్ ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. తాజాగా శ్రద్ధా కపూర్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. శ్రద్ధా కపూర్ మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా నాయక్ ఇ౦స్టాగ్రామ్ లో ఈ ఫస్ట్ లుక్ ను షేర్ చేసింది. కాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని, రెండవ షెడ్యూల్ లోకి అడుగు పెట్టింది.

Untitled Document
Advertisements