ఒక్కటవ్వనున్న.. 'బాజీరావు మస్థనీ'లు

     Written by : smtv Desk | Tue, Mar 06, 2018, 04:52 PM

ఒక్కటవ్వనున్న.. 'బాజీరావు మస్థనీ'లు

ముంబై, మార్చి 6 : వెండితెర “బాజీరావు మస్థనీ” లు మనువాడబోతున్నారు. “గోలీయోంక రాస్ లీలా రామ్ లీల” సినిమాలో జంటగా నటించిన తరువాత తమ ప్రేమను రణ్ వీర్ సింగ్-దీపిక పదుకొణెలు వివిధ సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు వారి పెళ్లి గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. వారి వివాహాన్ని నిశ్చయించిన అనంతరం సరదాగా అందరూ కలిసి ముంబైలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌ లో డిన్నర్‌ కూడా చేశారట. మరో మూడు నెలల్లో రణ్ వీర్ సింగ్-దీపిక పదుకొణెల వివాహం దక్షిణభారత సంప్రదాయం ప్రకారం ముంబైలో నిర్వహించనున్నట్లు సమాచారం.

Untitled Document
Advertisements