మోదీ ఫ్లెక్సీలపై బాబు ఆగ్రహం..

     Written by : smtv Desk | Tue, Mar 06, 2018, 06:51 PM

అమరావతి, మార్చి 7 : ఏపీలో ప్రత్యేక హోదా కోసం టీడీపీ, బీజేపీల మధ్య వివాదం పెరిగింది. ఏపీ ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చడం లేదంటూ టీడీపీ నేత కాట్రగడ్డ బాబు విజయవాడలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బీజేపీ నేతలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, మాధవ్ లు మండి పడ్డారు. బీజేపీని, ప్రధాని మోదీని కించపరిచే చర్యలను టీడీపీ నేతలు మానుకోవాలన్నారు.

ఈ నేపథ్యంలో మోదీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సదరు ఫ్లెక్సీలను వెంటనే తొలగించారు.

Untitled Document
Advertisements