'ది విజన్ ఆఫ్ భరత్ ' విడుదల..

     Written by : smtv Desk | Tue, Mar 06, 2018, 07:20 PM

'ది విజన్ ఆఫ్ భరత్ ' విడుదల..

హైదరాబాద్, మార్చి 7 : కొరాటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. ఇదివరకే చిత్రబృందం ప్రమాణస్వీకారం చేస్తున్న ఫస్ట్ లుక్ విడుదల చేసింది. తాజాగా 'ది విజన్ ఆఫ్ భరత్ ' అనే వీడియోను విడుదల చేసింది . ఇందులో ముఖ్యమంత్రిగా మహేష్ చెప్తున్న డైలాగ్స్.. సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పుతున్నాయి. దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రిన్స్ కి జోడీగా కైరా అద్వాని నటిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చారు. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.

Untitled Document
Advertisements