శ్రీదేవి కూతురు జాన్వీకి బర్త్ డే సర్‌ప్రైజ్..!

     Written by : smtv Desk | Wed, Mar 07, 2018, 11:39 AM

శ్రీదేవి కూతురు జాన్వీకి బర్త్ డే సర్‌ప్రైజ్..!

ముంబై, మార్చి 7 : దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్.. తన పుట్టినరోజు వేడుకలను ముంబైలోని ఓ వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు. తన తల్లి శ్రీదేవి బాటలోనే ప్రయాణిస్తూ.. వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. ప్రస్తుతం జాన్వీ కేక్ కట్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అనంతరం అక్కడి నుండి తన సోదరి సోనమ్‌కపూర్‌ నివాసంలో జరిగిన వేడుకల్లో పాల్గొంది.

21వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన జాన్వీ.. తన తల్లి లేకుండా జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు. అయితే కపూర్ కుటుంబంలోని అమ్మాయిలు మాత్రం ఈ రోజును ఆమెకు గుర్తుండేలా సర్‌ప్రైజింగ్‌గా సెలబ్రేట్ చేశారు. సోనమ్‌కపూర్‌, అన్షులా సహా ఫ్యామిలీ అంతా బర్త్ డే నాడు జాన్వీతోనే ఉన్నారు. జాన్వీ నటిస్తున్న తొలి సినిమా "ధడక్" లో ప్రముఖ కథానాయకుడు షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖత్తర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు.

Untitled Document
Advertisements