ట్రంప్ తక్కువ స్థాయి అధ్యక్షుడు : జిమ్మీ

     Written by : smtv Desk | Wed, Mar 07, 2018, 04:28 PM

ట్రంప్ తక్కువ స్థాయి అధ్యక్షుడు : జిమ్మీ

వాషింగ్టన్, మార్చి 7 : 90 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇటీవల అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నిలిచిన ప్రముఖ అమెరికన్ టెలివిజన్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి గతంతో పోలిస్తే 20 శాతం రేటింగ్ పడిపోయిందని నీల్సన్ ఓ నివేదికను వెల్లడించింది.

ఈ విషయంపై స్పందించిన ట్రంప్ ఎగతాళి చేస్తూ.. "ఆస్కార్ కు తక్కువ రేటింగ్ రావడం ఒక చరిత్ర. అసలు సమస్య ఏంటంటే ఇక్కడ సెలబ్రిటీలు ఎవరు లేరు. మీ అధ్యక్షుడు తప్ప(జస్ట్ జోకింగ్)" అని ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన జిమ్మీ.. "చరిత్రలోనే తక్కువ స్థాయి అధ్యక్షుడు మీరే" అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.





Untitled Document
Advertisements