"షకీలా" బయోపిక్..!

     Written by : smtv Desk | Wed, Mar 07, 2018, 04:58 PM


ముంబై, మార్చి 7 : ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం కొనసాగుతుంది. ఆ కోవలో వచ్చిన సినిమాల లిస్టు చెప్పుకుంటూ పోతే భారీగానే ఉంటుంది. తాజాగా మరో నటి జీవిత కథను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఆ నటి మరెవరో కాద౦డి 1990 లలో మలయాళ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేసిన శృంగార తార షకీలా. దక్షిణాదిన మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. అంతేకాక ఆమె సినిమాలను దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించడమే కాకుండా చైనీస్, నేపాలీస్ లాంటి ఇతర విదేశీ భాషల్లో సైతం డబ్బింగ్ చేస్తున్నారంటే ఆమెకున్న క్రేజ్ అలాంటిది మరి. ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రిచా చద్దా.. షకీలాగా నటించనున్నట్టు సమాచారం.

Untitled Document
Advertisements