"హోదా" ఏపీ ప్రజల హక్కు.. ఇవ్వాల్సిందే...

     Written by : smtv Desk | Wed, Mar 07, 2018, 05:39 PM


అమరావతి, మార్చి 7 : విభజన సమయంలో నష్టపోయిన ఏపీకి పదేళ్ల నుండి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన బీజేపీ.. ఇప్పుడెందుకు ఇవ్వడం లేద౦టూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్ని౦చారు. రాష్ట్రానికి ఎన్ని నిధులు, సౌకర్యాలు కేటాయించా రో అవన్ని ఇవ్వాల్సిందేనని అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు డిమాండ్ చేశారు. "రాష్ట్ర ప్రయోజనాల కోసమే తేదేపా, బీజేపీ కలిశాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ తగ్గేది లేదని, రాజీ పడే సమస్యే లేదని స్పష్టం చేశారు. హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. దానిని గౌరవించాల్సిన హక్కు కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు.

Untitled Document
Advertisements