కేంద్రంతో సంబంధాలు కట్..!

     Written by : smtv Desk | Thu, Mar 08, 2018, 11:46 AM

కేంద్రంతో సంబంధాలు కట్..!

అమరావతి, మార్చి 8 : ఎన్డీయే ప్రభుత్వంలోని తెదేపా మంత్రులు రాజీనామా చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరితో చర్చించిన ఆయన.. నేడు ఇద్దరు మంత్రులు రాజీనామాలు సమర్పిస్తారని స్పష్టం చేశారు. ఎన్డీయేలో కొనసాగాలా.? వద్దా.? అనే విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చిన భాజాపా.. ఇప్పుడు మాట మార్చడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. నిధుల విషయంలో లెక్కలన్ని సరిగాలేవన్న ఆయన.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సరిగా రావడం లేదని, పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి ఇంకా నిధులు రావాల్సి ఉందన్నారు.

కేంద్రం నుండి తెదేపా, వైదొలగే క్రమంలో ఎంపీలు, ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు ఢిల్లీ వీధుల్లో ఆందోళన చేపట్టారు. యథావిధిగా జైట్లీ.. "ప్రత్యేక హోదా"తో సమానమైన మొత్తాన్ని అందించడానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. దీంతో ఈ జైట్లీ ప్రకటన అనంతరం చంద్రబాబు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎంపీలంతా కేంద్రం నుంచి వైదొలగాలనే సూచించారు.

Untitled Document
Advertisements