తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా..

     Written by : smtv Desk | Thu, Mar 08, 2018, 12:21 PM

తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా..

అమరావతి, మార్చి 7 : మంత్రి పదవికి తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి పైడి కొండల మాణిక్యాల రావు అన్నారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన తన శాఖలో ఎప్పుడు జోక్యం చేసుకోలేదన్నారు.

రాష్ట్రం విడిపోయిన౦దుకు కాస్త బాధగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పరిణామాల వల్ల సంతోషం వ్యక్తం చేశారు. నాకు మంత్రి పదవి రావడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడే కారణమని.. విభజన బిల్లు రాజ్యసభకు వచ్చినప్పుడు పోరాడిన ఏకైక నాయకుడు ఆయనేనని కొనియాడారు. ప్రస్తుతం మంత్రి పదవిలో లేనప్పటికీ నా నియోజకవర్గం అభివృద్దికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు.

Untitled Document
Advertisements