ఏపీ బడ్జెట్ కేటాయింపులు..

     Written by : smtv Desk | Thu, Mar 08, 2018, 12:51 PM

ఏపీ బడ్జెట్ కేటాయింపులు..

అమరావతి, మార్చి 8 : ఏపీ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,91,063.61 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్‌ ప్రసంగం చేస్తున్నారు. ఇందులో భాగంగా మొత్తం బడ్జెట్ స్వరూపం.. రూ.1,91,063.61కోట్లు ఉండగా.. అందులో రెవెన్యూ వ్యయం.. రూ.1,50,270.99కోట్లు. గతంలో పోలిస్తే బడ్జెట్‌ 21.70శాతం పెరిగింది.
>>విభజనల వారిగా బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి.

* పోలవరం ప్రాజెక్టుకు రూ.9,000కోట్లు
* రైతు రుణమాఫీకి రూ.4,100కోట్లు
* విద్యా రంగానికి రూ.24,185.75కోట్లు.
* క్రీడలు, యువజన సేవల శాఖకు రూ.1,635.44 కోట్లు.
* వ్యవసాయ రంగానికి రూ.12,352కోట్లు.
* సాగునీటి రంగానికి రూ.16,978.23కోట్లు.
* గ్రామీణాభివృద్ధికి రూ.20,815కోట్లు.
* ఇంధన రంగానికి రూ.5,052.54కోట్లు
* పరిశ్రమల శాఖకు రూ.3,074.87కోట్లు
* రవాణా శాఖకు రూ.4,653కోట్లు
* గృహ నిర్మాణ శాఖకు రూ.3,679కోట్లు
* సాధారణ సేవల కోసం రూ.56,113.17కోట్లు
* సాంకేతిక విద్యకు రూ.818.02కోట్లు
* కళ, సాంస్కృతిక రంగానికి రూ.94.98కోట్లు
* సమాచార, పౌర సంబంధాల శాఖకు రూ.224.81కోట్లు
* కార్మిక, ఉపాధి కల్పనకు రూ.902.19కోట్లు
* చేతివృత్తులకు ఆదరణ పథకానికి రూ.750 కోట్లు
* చేనేతలను ప్రోత్సహించేందుకు జనతా వస్త్రాల పథకం కింద రూ.250కోట్లు
* జనతా వస్త్రాల సరఫరా కోసం రూ.200కోట్లు
* చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ.100కోట్లు, బీసీలకు రూ.100కోట్లు
* సామాజిక భద్రత కోసం రూ.3,029కోట్లు
* ఆర్థికంగా వెనుకబడిన కులా విద్యార్థులకు బోధన ఫీజు కోసం రూ.700కోట్లు
* కాపు సామాజిక విద్యార్థులకు రూ.400కోట్లు
* హోంశాఖకు రూ.6,226కోట్లు
* పర్యాటక శాఖకు రూ.290కోట్లు
* తాగునీరు, పారిశుద్ధ్యం కోసం రూ.2,623కోట్లు
* ఫైబర్‌ గ్రిడ్‌ కోసం రూ.600కోట్లు
* మెడ్‌ టెక్‌ జోన్‌ కోసం రూ.270కోట్లు
* అన్నా క్యాంటీన్ల కోసం రూ.200కోట్లు
* స్టార్టప్‌ల కోసం రూ.100కోట్లు
* ఎన్టీఆర్‌ జలసిరి కోసం రూ.100కోట్లు
* డ్వాక్రా మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్ల కోసం రూ.,100కోట్లు
* వారానికి ఐదు రోజులు గుడ్లు పథకానికి రూ.266కోట్లు
* పౌష్టకాహార లోపం నియంత్రణకు రూ.360కోట్లు
* హిజ్రాల సంక్షేమానికి రూ.20కోట్లు
* వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం రూ.4,477కోట్లు
* బీసీ సంక్షేమానికి రూ.12,200కోట్లు
* కాపుల సంక్షేమానికి రూ.1,000కోట్లు
* మేదరుల సంక్షేమానికి రూ.30కోట్లు
* నాయీ బ్రాహ్మణుల కోసం రూ.30కోట్లు
* వైశ్యుల సంక్షేమం కోసం రూ.30కోట్లు
* కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.70కోట్లు

Untitled Document
Advertisements