తెలంగాణ క్యాబినెట్ పై ఉత్తమ్ విమర్శలు..

     Written by : smtv Desk | Thu, Mar 08, 2018, 02:08 PM

తెలంగాణ క్యాబినెట్ పై ఉత్తమ్ విమర్శలు..

హైదరాబాద్, మార్చి 8 : దేశంలోనే మహిళలు లేని ఏకైక క్యాబినెట్ తెలంగాణ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు చేశారు. కేసీఆర్‌ కేబినెట్‌లో మహిళలకు ప్రాతినిథ్యం లేకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఈమేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముందుగా మహిళలందరికి “మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” తెలిపారు. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ ఇవ్వడం అసాధ్యం అని మోదీ మాట్లాడితే.. కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు నోరు మెదపలేదని గుర్తు చేశారు. అయితే డిసెంబర్‌లోనే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు

Untitled Document
Advertisements