“మహిళా”మణులకు సినీతారల శుభాకాంక్షలు..

     Written by : smtv Desk | Thu, Mar 08, 2018, 02:13 PM

“మహిళా”మణులకు సినీతారల శుభాకాంక్షలు..

హైదరాబాద్, మార్చి 8 : ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మహిళ ఎప్పుడు అలా వెలుగుతూనే ఉండాలి. అసలు మహిళ లేనిది పురుషుడు లేడంటూ సినీ తారలు గళమెత్తారు. నేటి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

* అమితాబ్ బచ్చన్ - విమెన్స్ డే.. ఈ ఒక్కరోజు మహిళలకు అంకితం. కానీ మహిళ రోజూ తన జీవితాన్ని అంకితం చేస్తుంది.

* యాంకర్‌ సుమ - అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజున నేను ఒకరికి స్పెషల్‌గా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారు. అదెవరో కాదు.. నాకు నేనే ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా పని నేను చేసుకోగలుగుతున్నాను. నా కుటుంబాన్ని ఇంతబాగా చూసుకోగలుగుతున్నందుకు నాకు నేను స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పాలనుకుంటున్నాను. మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది.

* సాయి ధరమ్ తేజ్ - "ఆమె" వలనే నేనున్నాను. అద్భుతమైన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

* అనుష్క - అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

* కాజల్‌ అగర్వాల్‌ - మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజే కాదు రోజూ మహిళ వెలుగుతూనే ఉండాలి.

* అనుష్క శర్మ - ఏదన్నా బలంగా కోరుకుని మన వంతు కృషి చేస్తూ జీవితంలో వేసే ప్రతి అడుగు మార్పు తెస్తుంది. దాని ప్రతిఫలం వెంటనే ఉండకపోవచ్చు కానీ ఫలితాలు మనపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. నచ్చిన దాని కోసం పోరాడుతున్న మహిళలందరికీ విమెన్స్‌ డే శుభాకాంక్షలు

* నరేశ్‌ - అందమైన తల్లులు, సోదరీమణులు, భార్యలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

Untitled Document
Advertisements