'కాలా' కుక్కకి సూపర్ క్రేజ్..!

     Written by : smtv Desk | Thu, Mar 08, 2018, 03:02 PM

'కాలా' కుక్కకి సూపర్ క్రేజ్..!

చెన్నై, మార్చి 8 : ధనుష్ నిర్మిస్తున్న 'కాలా' చిత్రంలో సూప‌ర్ స్టార్ రజనీకాంత్ క‌రికాల‌న్ అనే డాన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదివరకే విడుదలైన టీజర్ తో ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇటు సినిమాతో పాటు అటు తలైవా పక్కన నటించిన కుక్కకి కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోయిందనడంలో అతిశయోక్తి లేదు.

ఎ౦దుకంటే.. కాలాలో నటించినందుకు మ‌ణి అనే కుక్కకి భారీ డిమాండ్ ఏర్పడింది. రెండు నుండి మూడు కోట్లు ఇచ్చి మరీ కుక్కను సొంతం చేసుకుంటామంటూ ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. చెన్నైలోని ఓ రోడ్ లో 'మణి'(కుక్క)దొరికింది.. చాలా కుక్కలను పరిశీలించిన తరువాత దర్శకుడు రంజిత్ ఈ కుక్కను ఓకే చేశాడని ట్రైనర్ 'సిమన్' చెబుతున్నాడు.

మణిని అమ్మేందుకు మాత్రం సిమన్ ఇష్టపడడం లేదట. రజనీకాంత్‌తో చాలా రోజుల పాటు షూట్‌లో పాల్గొన్న ఈ కుక్క అంటే రజనీకి కూడా చాలా ఇష్టమట‌. దాని కోసం ప్రత్యేకంగా బిస్కెట్స్ సైతం తెచ్చిపెట్టేవారట. ఇంతకి ఈ కుక్కను అమ్మేస్తారా.? లేదా అనేది చూడాలి మరి.

Untitled Document
Advertisements