వైఎస్ విజయమ్మగా న‌య‌న్..!

     Written by : smtv Desk | Thu, Mar 08, 2018, 04:30 PM

వైఎస్ విజయమ్మగా న‌య‌న్..!

హైదరాబాద్, మార్చి 8 : హీరోని మరిపించే పాత్రలు చేయాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు నయనతార. పెద్ద సినిమా.. చిన్న సినిమా అని తేడా లేకుండా మంచి కథాకథనం ఉన్న సినిమాలు ఎంచుకుంటూ.. తన నటనతో ఒక ప్రత్యేక బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది.

ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా వస్తున్న 'సైరా' లో నటిస్తున్న నయన్ కు మరో అవకాశం వరించింది. ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. పదవిలో ఉన్న సమయంలోనే ప్రమాదవశాత్తు విమాన ప్రయాణంలో మరణించిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలను గుర్తు చేస్తూ దర్శకుడు మహి రాఘవ వైఎస్ ఆర్ బయోపిక్ ను తెరకెక్కించనున్నారట. అయితే వైఎస్సార్ పాత్రకి మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ ముమ్ముట్టిని తీసుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట. మమ్ముట్టి సరసన వైఎస్ భార్య విజయమ్మగా న‌య‌న‌తారని సెల‌క్ట్ చేసిన‌ట్టు స‌మాచారం.

Untitled Document
Advertisements