నయనతార ముందున్న "కర్తవ్యం"..

     Written by : smtv Desk | Thu, Mar 08, 2018, 05:36 PM

నయనతార ముందున్న

హైదరాబాద్, మార్చి 8 : మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు నయనతార పెట్టింది పేరు. శ్రీరామ రాజ్యంలో సీతాదేవి, మయూరి, డోరా, అనామిక ఇలా చేసిన ప్రతి పాత్రలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది తమిళనాట ఘన విజయ౦ సాధించిన "ఆరమ్" చిత్రాన్ని దర్శకుడు గోపి నైనర్.. "కర్తవ్యం" పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్ మరార్ ఈ చితాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రబృంద౦ మహిళా దినోత్సవం సందర్భంగా "కర్తవ్యం" ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఇందులో నయనతార.. ప్రజలకి ఏది అవసరమో అదే చట్టమవ్వాలి కానీ, చట్టాన్ని ముందే తయారు చేసి దాన్ని ప్రజల మీద రుద్దకూడదు అంటూ ప్రజాక్షేమం గురించి తపన పడే పాలనాధికారిగా ఆకట్టుకుంది. మార్చి 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Untitled Document
Advertisements