విజయ్ దేవరకొండ 'నోటా'..

     Written by : smtv Desk | Thu, Mar 08, 2018, 06:28 PM

విజయ్ దేవరకొండ 'నోటా'..

హైదరాబాద్, మార్చి 8 : విజయ్ దేవరకొండ.. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఒక తమిళ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం విజయ్ తానే స్వయంగా తమిళ౦లో డబ్బింగ్ చెప్పుకోనున్నాడట. నిజానికి మన 'అర్జున్ రెడ్డి'కి తమిళ్ రాదు. కాగా.. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత డబ్బింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు 'నోటా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'నోటా' అంటే .. 'ఈవీఎం'లో సూచించిన అభ్యర్థులనెవరినీ నేను ఎన్నుకోవడం లేదంటూ ఓటర్ తన అభిప్రాయాన్ని తెలియజేయడం. జ్ఞానవేల్ రాజా సమర్పిస్తోన్న ఈ సినిమాలో విజయ్ కి జోడీగా మెహ్రీన్ ఆడిపాడనుంది.

Untitled Document
Advertisements