కానుక చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు..

     Written by : smtv Desk | Fri, Mar 09, 2018, 02:20 PM

కానుక చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు..

ముంబై, మార్చి 9 : దివంగత నటి శ్రీదేవి అకాల మరణాన్ని తన భర్త బోనీ కపూర్ నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి చనిపోయిన నాటి నుండి ఆమెను తలుచుకొని కుమిలిపోతున్నారు. ఇప్పటికి పలువురు అభిమానులు.. బోనీ కుటుంబాన్ని పరామర్శించి శ్రీదేవికి నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ సతీమణి టీనా అంబానీ బోనీ కపూర్ కు ఓ కానుక ఇచ్చారు. ఫిబ్రవరి 11న ముంబైలో టీనా తన 61వ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు శ్రీదేవి దంప‌తుల‌తో పాటు బాలీవుడ్ కి చెందిన ప‌లువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీదేవితో క‌లిసి టీనా ప్ర‌త్యేకంగా ఓ ఫోటో తీయించుకుంది. ఫోటోకి వెండి ఫ్రేము చేయించి బోనికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ ఫొటో చూసి బోనీ ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంత‌మ‌య్యారట. శ్రీదేవితో క‌లిసి దిగిన ఆఖరి ఫొటో అవుతుందని అస్స‌లు అనుకోలేదంటూ టీనా కాస్త ఉద్వేగానికి లోన‌య్యారు.

Untitled Document
Advertisements