జూలై 1న ఏపీ సెట్‌..

     Written by : smtv Desk | Fri, Mar 09, 2018, 02:55 PM

జూలై 1న ఏపీ సెట్‌..

విశాఖ, మార్చి 9 : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ సెట్ పరీక్ష నిర్వహణను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జూలై ఒకటో తేదీన ఈ పరీక్ష నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఏయూ ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీన ఏపీ సెట్‌ నోటిఫికేషన్ విడుదలవుతుందని, 26 నుంచి దరఖాస్తుల ఆన్‌లైన్లో స్వీకరిస్తామని తెలిపారు.

యూజీసీ నిబంధనల ప్రకారం ఈ యేడాది నుండి ప్రతి సబ్జెక్టులో రెండు పేపర్లు మాత్రమే ఉంటాయని తెలిపారు. మొత్తం 31 సబ్జెక్టులలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. డిగ్రీ కళాశాలలు, వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆధ్యాపక పోస్టుల నియామకం కోసం దరఖాస్తు చేయాలంటే యూజీసీ నెట్, లేదా ఏపీ సెట్‌లో అర్హులై ఉండాలన్నారు. ఈసారి నెగిటివ్ మార్కులు లేవని స్పష్టం చేశారు.

Untitled Document
Advertisements