భాజపా పొత్తుతో తెదేపాకు ఒరిగిందేమీ లేదు..

     Written by : smtv Desk | Fri, Mar 09, 2018, 03:18 PM

భాజపా పొత్తుతో తెదేపాకు ఒరిగిందేమీ లేదు..

అమరావతి, మార్చి 9: భాజపా పొత్తువల్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అదనంగా ఒరిగిందేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సాధారణ ఎన్నికల కంటే ముందే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా విజయం సాధించిన విషయాన్ని ఆయన పార్టీ ముఖ్య నేతలకు గుర్తు చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చించుకునేందుకు ఓ వ్యూహ కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు.

కమిటీలో యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులతో పాటు మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, సలహాదారులు పరకాల ప్రభాకర్, కుటుంబరావు ఉన్నారు. పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించాలని కమిటీకి చంద్రబాబు ఆదేశించారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ పరిస్థితిని చంద్రబాబు తన నివాసంలో వ్యూహ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో విశ్లేషించారు.

Untitled Document
Advertisements