తెలంగాణ సీఎస్‌కు హైకోర్టు నోటీసులు..

     Written by : smtv Desk | Fri, Mar 09, 2018, 04:57 PM

తెలంగాణ సీఎస్‌కు హైకోర్టు నోటీసులు..

హైదరాబాద్‌, మార్చి 9 : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని సీఎస్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రైతు విమోచన కమిషన్‌ ఏర్పాటుచేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని భాజపా నేత ఇంద్రసేనా రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారించిన న్యాయస్థానం రైతు రుణ విమోచన కమిషన్‌ ఏర్పాటుచేయాలంటూ సీఎస్‌ను ఆదేశించింది. అయినా ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడంతో ఇంద్రసేనారెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సీఎస్‌కు నోటీసులు జారీచేసింది.

Untitled Document
Advertisements