తెలంగాణకు ఏమి చేయని సీఎం దేశానికే౦ చేస్తాడు..?

     Written by : smtv Desk | Fri, Mar 09, 2018, 05:59 PM

తెలంగాణకు ఏమి చేయని సీఎం దేశానికే౦ చేస్తాడు..?

లాలాపేట, మార్చి 9 : తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో గెలిపిస్తే ఏం చేయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశానికి ఏం చేస్తాడని రాజకీయ ఐకాస చైర్మన్‌ ప్రొ.కోదండరాం అన్నారు.. కొడుకును ముఖ్యమంత్రిగా చేయడానికి కేసీఆర్‌ చేస్తున్న ఎత్తుగడలో భాగమే మూడో కూటమని ఆయన పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన గ్రంథాలయంలోని ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ హాల్‌లో విద్యార్థి నాయకుడు నిజ్జన రమేష్‌ ముదిరాజ్‌ అధ్యక్షతన ‘మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తిని గుర్తుచేసుకుందాం - ఉద్యమ ఆకాంక్షలను సాధిద్దాం’ అనే అంశంపై విద్యార్థి నిరుద్యోగ మేధోమథన సదస్సును నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొ.కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఒక్కరితోనే కాలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధిస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని అంతా భావించారని కానీ నేడు వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. మార్చి 10న ట్యాంక్‌బండ్‌పై శాంతియుతంగా మిలియన్‌ మార్చ్‌ను గుర్తు చేసుకునేలా ఆటా పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

Untitled Document
Advertisements