ఏపీకి కేంద్రం సహకరిస్తోంది : పురంధరేశ్వరి

     Written by : smtv Desk | Fri, Mar 09, 2018, 06:21 PM

ఏపీకి కేంద్రం సహకరిస్తోంది : పురంధరేశ్వరి

విజయవాడ, మార్చి 9 : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు భాజపా తరపున పూర్తి సహకారం అందిస్తామని ఆ పార్టీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె... ఏపీకి కేంద్రం మంజూరు చేసిన జాతీయ ప్రాజెక్టులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు.

అన్ని జాతీయ విద్యాసంస్థల విషయంలోనూ కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోందన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంకా డిజైన్లు ఖరారు కాకముందే నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రానికి ఏ విషయంలో అన్యాయం జరిగిందో తెదేపా నేతలు చెబితే వాటిని మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

Untitled Document
Advertisements