బాధను దిగమింగి షూటింగ్ లో పాల్గొన్న జాన్వీ..

     Written by : smtv Desk | Fri, Mar 09, 2018, 06:50 PM

బాధను దిగమింగి షూటింగ్ లో పాల్గొన్న జాన్వీ..

ముంబై, మార్చి 9 : అందాల తార శ్రీదేవి వారసురాలిగా వెండితెరపైకి రానున్న జాన్వీ కపూర్.. త్వరలో "ధడక్" అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రాఠీ చిత్రం సైర‌త్‌కి రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతుంది.

తన తల్లి శ్రీదేవి మ‌ర‌ణం త‌ర్వాత కొద్ది రోజులు షూటింగ్‌కి దూరంగా ఉన్న జాన్వీ ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుండి కాస్త తేరుకొని తిరిగి షూటింగ్‌లో పాల్గొంది. ప్రస్తుతం జాన్వీకి సంబంధించిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. అందులో జాన్వీ అచ్చం శ్రీదేవిలాగే పచ్చరంగు చీర, పెద్ద బొట్టుతో అందంగా ఉన్నారు.

కాగా "ధడక్" ప్రస్తుత షెడ్యూల్ లో భాగంగా బాంద్రా ప్రాంతంలో జాన్వీ, ఈషాన్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరాఠీలో ఘన విజయం సాధించిన "సైరాత్‌" కు హిందీ రీమేక్‌గా వస్తోన్న చిత్రమిది. హీరో షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖత్తర్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం జులై 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Untitled Document
Advertisements