నేడు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలు నిషేధం..

     Written by : smtv Desk | Sat, Mar 10, 2018, 10:53 AM

నేడు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలు నిషేధం..

హైదరాబాద్, మార్చి 10 : నేడు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను నిషేధించాలంటూ పోలీసు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నేటి ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఐకాస ఆధ్వర్యంలో నేడు చేపట్టనున్న మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమించి జెండాలు పట్టుకుని వచ్చి ట్యాంక్‌బండ్‌పై సభ నిర్వహించేందుకు ప్రయత్నిస్తే అరెస్ట్‌ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో సాధారణ వాహనదారులు ఇటువైపు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
* సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలు.. మారియట్ హోటల్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ వైపు నుంచి మళ్లిస్తారు.
* రాణిగంజ్ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు. అదేవిధంగా రవీంద్రభారతి, ఎన్టీఆర్ గార్డెన్ నుంచి వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇందిరాపార్కు వైపు మళ్లించేందుకు చర్యలు చేపట్టామని ట్రాఫిక్ జాయింట్ సీపీ రవీందర్ తెలిపారు.

Untitled Document
Advertisements