ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం : కోదండరామ్‌

     Written by : smtv Desk | Sat, Mar 10, 2018, 12:01 PM

ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం : కోదండరామ్‌

హైదరాబాద్‌, మార్చి 10 : తాము ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం కట్టడిచేస్తోందని ఐకాస చైర్మన్‌ కోదండరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. ట్యాంక్‌బండ్‌పై ఐకాస ఆధ్వర్యంలో చేపట్టనున్న మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ఆయన తార్నాకలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఏ ఉద్యమం వల్ల తెలంగాణ వచ్చిందో ఆ ఉద్యమాన్ని గుర్తుచేసుకోవాలని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ సంఘటనలు, ఆకాంక్షలను గుర్తుచేసుకోవడం నేరం కాదని అన్నారు.. వేలాది మంది ఐకాస నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని.. 24 గంటలు దాటితే అరెస్టయిన వ్యక్తులను కస్టడీలో ఉంచుకోకూడదని అన్నారు. ప్రభుత్వ వైఖరిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. మిలియన్‌ మార్చ్‌ను గుర్తుకు తేవడం ఇష్టం లేనందునే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

Untitled Document
Advertisements