నాని “కృష్ణార్జున యుద్ధం”.. టీజర్

     Written by : smtv Desk | Sat, Mar 10, 2018, 12:03 PM

నాని “కృష్ణార్జున యుద్ధం”.. టీజర్

హైదరాబాద్, మార్చి 10 : నటుడిగానే కాకుండా ఇటీవల "అ" చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి మంచి మార్కులే కొట్టేశారు హీరో నాని. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో "కృష్ణార్జున యుద్ధం" అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నానికి జోడీగా అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మిర్ కథానాయికలుగా నటిస్తున్నారు. కృష్ణ పాత్రలో మాస్ గా, అర్జున్ పాత్ర‌లో రాక్‌స్టార్‌గా నాని డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని శైన్ స్క్రీన్స్ పతాకంపై గరపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా కృష్ణ‌, అర్జున్ పాత్ర‌ల‌కి సంబంధించిన టీజ‌ర్ ను చిత్రబృందం విడుద‌ల చేసింది. "ఏడుండార్రా గోపికలు.. నూడిల్స్ చేయడానికి నువ్వు అమ్మాయిల్ని పడేయడానికి ఒకటే టైమ్ పడుతోంది ఎలారా?" అంటూ సాగిపోయే ఈ టీజ‌ర్.. మొత్తానికి ఒక రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరి౦చనుంది. కాగా ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Untitled Document
Advertisements