వారి గురించి నేను ఆలోచించను : రాధికా

     Written by : smtv Desk | Sat, Mar 10, 2018, 12:35 PM

వారి గురించి నేను ఆలోచించను : రాధికా

ముంబై, మార్చి 10 : హీరోయిన్ లు వేసుకునే దుస్తుల విషయంలో సోషల్ మీడియాలో నెటిజన్లకు హీరోయిన్ లకు మధ్య చిన్నపాటి యుద్దమే జరుగుతుంది. ఇటీవలే దుస్తుల విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో నెటిజన్లను తీవ్రంగానే ఖండించింది. మా దుస్తులు మా ఇష్టం వచ్చినట్టు మేం వేసుకుంటామని ఘాటైన సమాధానమిచ్చింది.

తాజాగా రాధికా ఆప్టేకి కూడా ఈ అనుభవం ఎదురైంది. ఇటీవల రాధిక తన భర్త బెనడిక్ట్‌ టేలర్‌తో కలిసి విహారయాత్రకు గోవా వెళ్లారు. అక్కడి బీచ్‌లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకోగా.. ఫొటోలు బాగున్నాయంటూ పలువురు సానుకూలంగా స్పందిస్తే మరికొందరు బికినీ వేసుకున్నారని.. మీరు అలా ఉన్నారు.. ఇలా ఉన్నారంటూ నోటికొచ్చినట్లు కామెంట్లు పెట్టారు.

ఈ మేరకు రాధికను ఓ మీడియా ప్రశ్నిస్తూ.. నెటిజన్ల కామెంట్లకు మీ స్పందన ఏంటి? అని అడగగా.. “ఎవరో చెబితే కానీ నాపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నట్లు తెలియదు. బీచ్‌లో చీర కట్టుకోమంటారా.? నా పై కామెంట్లు చేస్తున్నదేవరో నాకు తెలియదు. వారి గురించి నేను ఆలోచించను” అని రాధిక ఘాటుగా సమాధానమిచ్చారు.

Untitled Document
Advertisements