మూడో ఫ్రంట్‌కు స్వాగత౦ : సీపీఎం

     Written by : smtv Desk | Sat, Mar 10, 2018, 12:39 PM

మూడో ఫ్రంట్‌కు స్వాగత౦ : సీపీఎం

నల్గొండ, మార్చి 10 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెర పైకి తెచ్చిన మూడోఫ్రంట్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భాజపా, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంపై తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులకున్న చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉండాలనే సిద్ధాంతం సరైనదేనని యాభై ఏళ్లుగా సీపీఎం చెబుతోందన్నారు. నాలుగేళ్లుగా కేంద్రం విధానాలనే రాష్ట్రాల్లోనూ అనుసరిస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు హఠాత్తుగా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం హాస్యాస్పదమని దుయ్యబట్టారు.

Untitled Document
Advertisements