మెహ్రీన్ ఫాన్స్ కి స్వీట్ వార్నింగ్..!

     Written by : smtv Desk | Sat, Mar 10, 2018, 06:56 PM

మెహ్రీన్ ఫాన్స్ కి స్వీట్ వార్నింగ్..!

హైదరాబాద్, మార్చి 10 : వెండితెరపై నటించే నటీనటులకు అభిమానులు ఉండటం సాధాణమే. ఫ్యాన్స్ వాళ్ళ అభిమానాన్ని వివిధ సందర్భాలలో వ్యక్తపరుస్తూనే ఉంటారు. కొందరు చేసే పనులు మాత్రం ఆకాశమే హద్దుగా ఉంటాయి. ఇలాంటి అభిమానమే ఒకటి హీరోయిన్ మెహ్రీన్ కి ఎదురైంది. తన పేరును ఓ అభిమాని అతని మెడపై పచ్చబొట్టు వేయించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసింది. అభిమానులందరూ తనకు చాలా ఇష్టమని, అందువల్ల ఇలాంటి పనులతో తమను తాము బాధించుకోవద్దని ఆమె స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చింది. ఇలా హెచ్చరిస్తూనే ఇంతలా అభిమానించడంపై ఆమె అశ్చర్యం వ్యక్తం చేస్తూ.. 'ఐ లవ్ యూ ఆల్' అంటూ ఓ పోస్ట్ చేసింది.

Untitled Document
Advertisements