'థర్డ్ ఫ్రంట్‌' పై కేటీఆర్ స్పందన..

     Written by : smtv Desk | Sat, Mar 10, 2018, 07:07 PM

'థర్డ్ ఫ్రంట్‌' పై కేటీఆర్ స్పందన..

న్యూఢిల్లీ, మార్చి 10 : ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌ ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మీడియా కేటీఆర్ ను ప్రశ్నించగా.. దేశంలో ఉన్నది రెండు పార్టీల వ్యవస్థ కాదు. రెండు పార్టీల మధ్య పోరాటం అంతకన్నా కాదు. ప్రస్తుతం ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజాకాంక్షల్ని నెరవేర్చడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో భాజపాను చూసినా, కాంగ్రెస్‌ను చూసినా రెండూ పూర్తి మెజార్టీ సాధించే పరిస్థితుల్లో లేవు. అధికారమంతా ఢిల్లీలో కేంద్రీకృతమైంది. అది సరైన పద్ధతి కాదు. కేంద్రాన్ని ప్రశ్నించే విధంగా.. ఓ కొత్త ప్రత్యామ్నాయం వస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చర్చకు శ్రీకారం చుట్టారు. ఇది మంచి పరిణామాలకే దారి తీస్తోందన్నారు. కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాష్ర్టానికి అదనంగా రాలేదు. రావాల్సిన చెందాల్సిన నిధులే వచ్చాయి. ఏపీకి సైతం ఇదే జరిగింది. అందుకే టీడీపీ బయటికి వచ్చిందనుకుంటానని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Untitled Document
Advertisements