సినిమాగా సన్నీలియోన్.. జీవిత చరిత్ర..!

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 11:27 AM

సినిమాగా సన్నీలియోన్.. జీవిత చరిత్ర..!

ముంబై, మార్చి 11 : శృంగారతారగా ప్రపంచానికి పరిచయమైన నటి సన్నీలియోన్.. ప్రస్తుతం పలు చిత్రాలలో ప్రత్యేక గీతాలు, అడల్ట్‌ కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నారు. కోట్ల సంఖ్యలో ఆమెకు అభిమానులు ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. ఇంతటి క్రేజ్ సంపాదించిన సన్నీ జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుందట. తాజాగా సన్నీలియోన్ జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. కాకపోతే అది పూర్తిస్థాయి సినిమాగా కాదు ఓ వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కించనున్నారు.

సన్నీ అసలు పేరు కరణ్‌జీత్ కౌర్ కావున ఈ చిత్రానికి "కరణ్‌జీత్" అనే పేరును ఖారారు చేశారు. స్వయంగా ఈ విషయాన్ని సన్నీ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఈ చిత్రంలో.. అసలు సన్నీ కెనడా నుండి ఎందుకు తిరిగి వచ్చింది? పేరు మార్చుకోవడానికి గల కారణాలు ఏంటి.? ఆ తరువాత ఆమె జీవితంలో జరిగిన మలుపులేంటి.? అనే విషయాలను చూపించనున్నారు. కాని ఈ చిత్రంలో సన్నీనే నటిస్తుందా.? లేదా ఇంకెవరైనా నటిస్తారా.? అనే విషయాలను మాత్రం పేర్కొనలేదు.

Untitled Document
Advertisements