భాజపా కోర్‌ కమిటీ సమావేశం..

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 12:34 PM

భాజపా కోర్‌ కమిటీ సమావేశం..

విజయవాడ, మార్చి 11 : విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నేతృత్వంలో పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి పార్టీ సహ సంఘటన కార్యదర్శి సతీష్ జీ హాజరయ్యారు. తెలుగుదేశంతో మైత్రీ బంధం విచ్చిన్నమైన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు.

ఇకపై తెలుగుదేశం పార్టీతో, రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొనాలనే అంశంపైన నేతలు సమాలోచనలు చేస్తున్నారు. సినీనటి కవిత ఈ సందర్భంగా బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Untitled Document
Advertisements