రణ్‌వీర్‌ సరసన ప్రియా ప్రకాష్.!

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 12:50 PM

రణ్‌వీర్‌ సరసన ప్రియా ప్రకాష్.!

ముంబై, మార్చి 11 : ఓర చూపుతో చూసి కన్ను గీటుతూ యావత్ దేశాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్న 16 ఏళ్ళ మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కు ఆఫర్లు వరుస కట్టాయి. "ఒరు ఆదార్ ల‌వ్" అనే మలయాళీ చిత్రంలో నటించిన ప్రియ ప్రకాశ్‌కు టాలీవుడ్‌, బాలీవుడ్‌లో ప‌లు ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా ఇప్పుడు "టెంప‌ర్" హిందీ రీమేక్‌లో ప్రియా ప్ర‌కాశ్‌నే హీరోయిన్‌గా తీసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో రణ్‌వీర్‌ సింగ్ సరసన ప్రియా ప్రకాష్ ను తీసుకున్నట్లు సమాచారం. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను "సింబా" అనే టైటిల్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. తొలుత రణ్‌వీర్‌కి జోడీగా ఆలియా భట్‌, శ్రద్ధాకపూర్ లను అనుకున్నారు. కాని ఆ అదృష్టం ప్రియాను వరించింది. ఈ సినిమాకు కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Untitled Document
Advertisements