రాబోయే ఎన్నికల్లో జగన్ సీఎం : రోజా

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 12:56 PM

రాబోయే ఎన్నికల్లో జగన్ సీఎం : రోజా

మాచవరం, మార్చి 11 : రానున్న ఎన్నికల్లో జగన్‌ సీఎం కావటం తథ్యమని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త కాసు మహేష్‌రెడ్డి చేపట్టిన ‘అదే బాట’ పాదయాత్ర పిన్నెల్లిలో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రోజాతో పాటు గుంటూరు-2 ఎమ్మెల్యే ముస్తాఫా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అక్కడ జగనన్న, ఇక్కడ మహేష్‌రెడ్డి నడుస్తుంటే తెదేపా నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు. రైతుల జీవితాల్లో ఆనందం రావాలన్నా, పేదల బతుకుల్లో వెలుగులు చూడాలన్నా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పారు.

గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహిళల అక్రమ రవాణాలో రెండో స్థానం, ఎస్సీ, ఎస్టీలపై దౌర్జన్యంలో మూడో స్థానంలోనూ రాష్ట్రం ఉందన్నారు. ముస్లిం సోదరులు అందరూ వైకాపాకి మద్దుతు ఇవ్వాలని ఎమ్మెల్యే ముస్తాఫా కోరారు.

Untitled Document
Advertisements