నా భార్యను తప్పుపట్టలేను : షమీ

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 01:11 PM

నా భార్యను తప్పుపట్టలేను : షమీ

న్యూఢిల్లీ, మార్చి 11: టీమిండియా పేసర్ మొహ్మద్ షమీ భార్య హసీన్‌ జహాన్‌ చేసిన ఆరోపణలపై గత కొన్ని రోజులుగా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై షమి తొలిసారి స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై తన భార్యను ఎవరో ప్రభావితం చేశారని వ్యాఖ్యానించారు.

‘ఈ వ్యవహారంలో నా భార్యను తప్పుపట్టను. ఆమెను ఎవరో ప్రభావితం చేశారు. గతంలోనూ మేము కొన్ని సార్లు గొడవపడ్డాం. వాటిని పరిష్కరించుకున్నాం కూడా’ అని వెల్లడించారు.

కాగా తాజా వివాదంతో షమీ కెరీర్ ప్రమాదంలో పడింది. ఇప్పటికే బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితాపై వేటు వేసింది. అంతే కాకుండా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కూడా అతన్ని తప్పించే అవకాశాలున్నాయనే వార్తలు కుడా వస్తున్నాయి.






















Untitled Document
Advertisements