రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఆలస్యంపై ఉత్కంఠ..

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 02:23 PM

అమరావతి, మార్చి 11 : తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఆలస్యం పై ఉత్కంఠ కొనసాగుతోంది. వర్ల రామయ్య, సీఎం రమేష్‌ అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారై ప్రకటన వెలువడుతుందనుకున్న సమయంలో బ్రేక్‌ పడింది. చంద్రబాబు సాయంత్రం సీనియర్‌ నేతలతో మరోసారి చర్చించి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సీఎం రమేష్‌, వర్ల రామయ్య అభ్యర్థిత్వాలు ఖరారైనట్లేనని తెలుస్తోంది. అయితే ఎంపిక ప్రకటనలో జరుగుతున్న ఆలస్యంపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది.

Untitled Document
Advertisements