చైనా పీఠంపై జీవితాంతం జిన్ పింగ్..

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 03:02 PM

చైనా పీఠంపై  జీవితాంతం జిన్ పింగ్..

బీజింగ్, మార్చి 11‌: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ (64) జీవితాంతం అదే అత్యున్నత పదవిలో కొనసాగేందుకు వీలుకల్పించే రాజ్యాంగ సవరణకు ఆ దేశ జాతీయ చట్టసభ.. నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (సీపీసీ) ఆదివారం ఆమోదం తెలిపింది. చైనాలో అద్యక్ష, ఉపాధ్యక్ష భాద్యతలు ఏ వ్యక్తులైన రెండు సార్లకుమించి ఉందకూడదనే రాజ్యాంగ నిబంధను తొలిగించింది. గతంలో దీనిపై చైనా పొలిట్‌ బ్యూరో ఆమోదం తెలపడంతో నేడు జరిగిన ఓటింగ్‌ కేవలం నామమాత్ర తంతుగానే మారింది.

మొత్తం 2,964 ఓట్లలో మూడు గైర్హాజరు కాగా.. రెండు వ్యతిరేకంగా వచ్చాయి. ఇక మిగిలిన ఓట్లన్నీ జిన్‌పింగ్‌కు అనుకూలంగానే వచ్చాయి. ప్రస్తుతం చైనా అధ్యక్షుడిగా ఉన్న జిన్‌పింగ్‌ పదవీకాలం 2023తో ముగియనుంది. తాజా నిర్ణయంతో జిన్‌పింగ్‌ చైనా అధ్యక్షుడిగా ఎన్నిసార్లయినా పోటీ చేయవచ్చు.





Untitled Document
Advertisements