మారిషస్‌లో రాష్ట్రపతి పర్యటన..

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 03:28 PM

మారిషస్‌లో రాష్ట్రపతి పర్యటన..

న్యూఢిల్లీ, మార్చి 11 : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ మడగాస్కర్‌, మారిషస్‌ వెళ్లనున్నట్లు విదేశాంగ‌ శాఖ ప్రతినిధులు తెలిపారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ‌మారిషస్‌ 50వ స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సంజయ్‌ పాండ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మారిషస్‌ ప్రధాని ప్రావింద్‌ జగన్నాథ్‌‌తో భేటీ అవుతారు. అనంతరం వరల్డ్‌ హిందీ సెక్రటేరియట్‌ను ప్రారంభిస్తారు. అంతేకాకుండా ఈఎన్‌టీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

కోవింద్‌ ఈనెల 14-15 తేదీల్లో మడగాస్కర్‌ను సందర్శిస్తారు. వీవీఐపీ హోదాలో ఈ ద్వీపకల్పాన్ని పర్యటించనున్న మొదటి భారతీయుడు కోవిందేనని తూర్పు, దక్షిణ ఆఫ్రికా ప్రాంతాల సంయుక్త కార్యదర్శి నీనా మల్హోత్రా అన్నారు.


Untitled Document
Advertisements